Wednesday, September 3, 2025

డయాబెటిస్ కు పాంక్రియాస్ సెల్స్ ట్రాన్స్ ఫర్ చెక్ పెడుతుందా?

- Advertisement -
దీర్ఘకాలంగా టైపు వన్ డయాబెటిస్తో బాధపడుతున్న ఓ 47 ఏళ్ల వ్యక్తికి ప్యాంక్రియాటిక్ సెల్స్ ఓ ఇంజక్షన్ ద్వారా మోచేతి దగ్గర ఉన్న నరం నుంచి ట్రాన్స్ఫర్ చేశారు.. మామూలుగా అయితే మన శరీరంలోకి ఏవైనా కొత్త సెల్స్ ప్రవేశిస్తే వాటిని మన ఇమ్యూన్ సిస్టం నాశనం చేస్తుంది.. అందుకనే ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగినప్పుడు కూడా వాళ్లకు ఇమ్యునోసప్రెషన్ డ్రగ్స్ వేసుకోవడం కంపల్సరీ. ఇందుకోసం శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా పాంక్రియాటిక్ సెల్స్ ను ట్రాన్స్ఫర్ చేసే ముందు జెనెటిక్ గా రెండు మార్పులు చేశారు. ప్రతి సెల్ మీద ఒక జెనెటిక్ మార్కర్ ఉంటుంది దానిని పట్టే అది మన సెల్లా లేక బయట నుంచి వచ్చిన సెల్లా అని మన బాడీలోని Tసెల్స్ రికగ్నెజ్ చేస్తాయి.. అటువంటి మార్కర్స్ వాటిని మొదట తొలగించారు. ఇక రెండవది సిడి 47 అనే మార్కర్ను ఆడ్ చేశారు. ఇది మన యొక్క బాడీలో వచ్చే ఇమ్యున్ రెస్పాన్స్ బ్లాక్ చేస్తుంది. ఫలితాలు నాటకీయంగా ఉన్నాయి.
12 వారాలలో ఈ కొత్త కణాలు గ్లూకోజ్ స్పైక్‌లకు ప్రతిస్పందనగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. భోజనం తర్వాత మన గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి ఇన్సులిన్ శరీరంలోనికి విడుదల చేయడం ప్రారంభించాయి. ఈ కణాలను సజీవంగా ఉంచడానికి మనిషికి ఎటువంటి రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు అనగా ఇమ్యునోసప్రెషన్ అవసరం లేదు. కానీ సవరించిన కణాలన్నీ మనుగడ సాగించలేదు, సవరణలు ఉన్నవి మాత్రమే క్రియాత్మకంగా ఉన్నాయి. క్రియాత్మక, జన్యు-సవరించిన కణ మార్పిడి రోగనిరోధక వ్యవస్థ దాడి చేయకుండా మానవ శరీరంలో మనుగడ సాగించగలదని, పని చేయగలదని ప్రయోగం చూపిస్తుంది. త్వరలో ఇన్సులిన్ అవసరం లేకుండా రోజు ఇంజక్షన్ చేసుకునే అవసరం లేకుండా ఈ కొత్త జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ పాంక్రియాటిక్ సెల్ మెథడ్ ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది.. అలా జరిగితే డయాబెటిస్ వారికి నిజంగా శుభవార్తనే అని చెప్పవచ్చు.
మూలం: “ఇమ్యునోసప్రెషన్ లేకుండా మార్పిడి చేయబడిన అలోజెనిక్ బీటా కణాల మనుగడ” న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడ్. (2025)
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News