- Advertisement -
పంజాగుట్ట: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట మెట్రో కింద డివైడర్‌ను లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. లారీ పురుగుల మందులోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులోనికి జారుకోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
- Advertisement -