ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు కోసం తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌కు చోటు దక్కింది. నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నారు. 29 ఏళ్ల జగదీశన్ దేశవాళీక్రికెట్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి టీమిండియా టెస్టు జట్టులో చోటు లభించింది. డొమెస్టిక్ క్రికెట్‌లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహించే జగదీశన్ మంచి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటి వరకు 79 దేశవాళీ క్రికెట్‌లు ఆడిన ఇతను 47.50 సగటుతో 3,373 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలోతమిళనాడు తరఫున వరుసగా రెండు సీజన్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 202324 సీజన్‌లో 74.18 సగటుతో 816 పరుగులు చేశాడు. 202425 రంజీ సీజన్‌లో 674 పరుగులు సాధించాడు. అంతేగాక చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 321 పరుగులు సాధించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీలో ఐదు సెంచరీలతో సహా ఏకంగా 830 పరుగులు నమోదు చేశాడు.