Friday, June 13, 2025

ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా

- Advertisement -
- Advertisement -

కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాడా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పాపా’ (Papa) పేరుతో వస్తోంది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాకు గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. పాపా చిత్రాన్ని జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నటసింహం బాలకృష్ణ (Natasimham Balakrishna) పుట్టినరోజు సందర్భంగా ‘పాపా‘ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ “-ఈ చిత్రం తమిళంలో‘డా డా’ పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నీరజ కోట భర్త శశికాంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News