మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శిగా మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి బి.పాపిరెడ్డి నియమితు ల య్యారు. హైకోర్టు సిఫార్సు మేరకు ప్రభుత్వం పాపిరెడ్డిని డిప్యూటేషన్ పద్దతిలో నియమిస్తూ సిఎస్ కె.రామకృష్ణారావు గురువారం జీవో నంబర్ 547 జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏడాది కాలం పాటు ఆ యన ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు జీవోలో వెల్లడించారు. రాష్ట్ర న్యా యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన రేండ్ల తిరుపతి డిప్యూటేషన్ ముగియడంతో గత వారం ఆయన రిలీవ్ అయ్యారు. తన డిప్యూటేషన్ పొడిగించాలని రేండ్ల తిరుపతి సిఎం రేవంత్ రెడ్డికి అర్జీ పెట్టుకున్నారు. దీ న్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన స్థానంలో న్యాయ శాఖ అదనపు కా ర్యదర్శి సునీతకు తాత్కాలిక ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్ర మంలో లా సెక్రటరీ పోస్టు కోసం హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ఐదు పే ర్లతో కూడిన జాబితాను పంపించగా పాపిరెడ్డి పేరును ఫైనల్ చేసింది.
ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శిగా పాపిరెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -