Tuesday, July 29, 2025

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికైన పారడైజ్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ రూరల్‌ః కరీంనగర్‌లోని రేకుర్తిలోని పారడైజ్ పాఠశాల చెందిన బి.అవంత్ నాయక్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల చైర్మెన్ ఫాతీమారెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో అదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూడో జూనియర్ స్థాయి పోటీలలో అద్భుతంగా రాణించి వచ్చేనెలలో వరంగల్‌లో జరుగునున్న రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్ జట్టు నుండి ప్రాతినిధ్యం వహించనున్నాడని చైర్మెన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆభినందన సభ నిర్వహించి విద్యార్థి బి.అవంత్ నాయక్‌ను పాఠశాల చర్మెన్ ఫాతీమారెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఆభినదించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసంత, వైస్ ప్రిన్సిపల్ మధు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News