అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిద్యమైన సినిమాలతో హీరో గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి నటించిన తాజా మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ’ఎస్.ఎస్. మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ’ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది ‘పరమపద సోపానం’.
ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుకను కూడా గ్రాండ్‌గా (teaser launch ceremony was also grand) నిర్వహించింది చిత్ర బృందం. అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ “శివ నాకు ఈ కథ చెబుతున్నప్పుడు.. హీరో ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి నాకు పూరి స్టైల్లో అనిపించాయి. వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శివ చాలా కష్టపడి ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు”అని తెలిపారు. దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ “హీరో అర్జున్ అంబటి యాక్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్‌లో తన బెస్ట్ ఇచ్చాడు. జెన్నీ పాత్ర కూడా గుర్తుండిపోతుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, శివ ప్రసాద్, డేవ్ జాండ్ తదితరులు పాల్గొన్నారు.