- Advertisement -
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగాపూర్ సమీపంలో బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన టూరిస్టులు పరిగిలో వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -