- Advertisement -
పచ్చని నారుమడిలో రామ చిలుకలు సందడి చేశాయి. ఈ అపురూప దృశ్యం మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల కేంద్రం నుంచి కొత్తపల్లికి వెళ్లే మార్గంలోని కొత్తగా నిర్మించిన బ్రిడ్జికి దగ్గరలోని ఒక రైతుకు చెందిన నారుమడిలో ఆవిష్కృతమైంది. నీరు పోసిన నారు మడిలో రామ చిలుకలు పెద్దఎత్తున వాలాయి. రైతు తన పొలంలో పోసుకున్న వరి నారు మడిలో మొలకెత్తిన వరి గింజలను తినడానికి వచ్చిన రామ చిలుకలను చూసి అటువైపు వెళ్తున్న బాటసారులు ఆనందం వ్యక్తం చేశారు. చాలారోజులకు రామ చిలుకలు గుంపులుగా కనిపించడంతో సంబురపడ్డారు.
- Advertisement -