Friday, September 12, 2025

పార్టీ మారలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మేము పార్టీ మారలేదు&బీఆర్‌ఎస్‌లో ఉన్నాం’ అని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానా లు పంపించినట్టు తెలిసింది. తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు వారు స్పష్టం చేసారని సమాచారం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మూడు నెలల్లో చర్య తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారికి స్పీకర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే గడువు రేపు (శుక్రవారం) తీరిపోతుండటంతో 10 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు తమ సమాధానాలు గురువారం పంపించగా,

మిగతా ఎమ్మెల్యేలు శుక్రవారం తమ సమాధానాలను పంపిస్తార ని తెలిసింది. తమ సమాధానాలు పంపించిన వారిలో బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేఅరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మె ల్యే కాలే యాదయ్య, పటెన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఉండగా, ఇంకా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సమాధానం ఇవ్వాలి ఉంది. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రినికలిసామని, తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగతున్నానని, పార్టీ మారామన్న దాంట్లో వాస్తవం లేదని వీరిలో కొందరు పేర్కొనగా, తన ఫోటోలు మార్ఫింగ్ చేసి పార్టీ మారినట్టు తప్పుడు ప్రచారం చేసారని, తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

దానం ఏం చేస్తారు?
పార్టీ మారలేదని చెప్పడానికి దానం నాగేందర్‌కు ఆస్కారం లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు ఆయన ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నారన్నది ఉత్కంఠగా మా రింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ వివాదం నుం చి బయటపడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం:మంత్రి పొంగులేటి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News