Saturday, July 12, 2025

ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం.. కెప్టెన్సీకి దూరం..

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాల మధ్య టి-20, వన్డే సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కి ముందు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా కమ్మిన్స్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో యాషెస్ సిరీస్, వేసవిలో బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఈ సిరీస్ నుంచి తాను తప్పుకున్నాడు. ప్రస్తుతం కమ్మిన్స్ మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు టెస్ట్‌ల విజయంతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. శనివారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభంకానుంది.

అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కి ముందు కమ్మిన్స్ (Pat Cummins) తాను విశ్రాంతి తీసుకుంటున్న నిర్ణయాన్ని వెల్లడించాడు. మూడో టెస్ట్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో తాను మాట్లాడుతూ.. ‘‘రాబోయే రెండు నెలలు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను. వేసవిలో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు నాకు 7 వారాల సమయం దొరుకుతుంది. అయితే ఈ సమయంలో బౌలింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోవచ్చు. కానీ, జిమ్ వర్క్ ఎక్కువగా చేస్తా. న్యూజిలాండ్, భారత్‌తో జరిగే సిరీస్‌ల కోసం మళ్లీ ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెడ్‌ బాల్ క్రికెట్‌లో టోర్నీషెఫీల్డ్, యాషెస్ సిరీస్‌లలో పాల్గొంటాను’’ అని పేర్కొన్నాడు. మరి కమ్మిన్స్ స్థానంలో ఆసీస్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News