- Advertisement -
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అడుగడుగునా సామాన్యుడి పక్షంగా ఉంటూనే అణువణువునా సామాజిక స్పృహ కలిగి ఉన్నావని ప్రశంసించారు. మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం పవన్ లో ఉందని కొనియాడారు. రాజకీయాల్లో విలువలకు పట్టం కట్టావని, స్పందించే హృదయం అని, అన్నీ కలిస్తేనే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో పవన్ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి బాబు ఆకాంక్షించారు. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవడంతో పాటు పాలనలో, రాష్ట్రాభివృద్దిలో పవన్ సహకారం మరువలేనిది అని చంద్రబాబు తెలిపారు.
- Advertisement -