హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, స్టార్ హీరో అల్లు అర్జున్ నాన్నమ్మ అల్లు కనకరత్నమ్మ(94) శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో పాటు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అల్లు నివాసానికి వచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. తాజాగా ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కనకరత్నమ్మ్ తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారంటూ ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ పవన్ (Pawan Kalyan) శనివారమే సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. విశాఖలో నిర్వహించిన జనసేన బహిరంగ సభ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్‌లోని అల్లు నివాసానికి చేరుకొని అల్లు అరవింద్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇక కనకరత్నమ్మ మరణానంతరం ఆమె నేత్రాలను దానం చేశారు. చూపులేని వారికి వెలుగునిచ్చేందుకు ఆమె చేసిన ఈ పనిని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. కనకరత్నమ్మ ఎందరికో స్పూర్తి దాయకమని ఆయన పేర్కొన్నారు.
Also Read : ఆ మాట క్రిష్ చెప్పడం సంతోషాన్నిచ్చింది