Tuesday, May 20, 2025

‘అది ఎంతో అదృష్టం’.. కీరవాణిని సత్కరించిన పవన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతికృష్ణల దర్శకత్వంలో ఎపి డిప్యూటీ సిఎం, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా కీరవాణిని, పవన్ కళ్యాణ్ సత్కరించారు.

కీరవాణి (MM Keeravani) స్టూడియోకి వెళ్లిన పవన్‌ ఆయన్ను సన్మానించారు. మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి ఆస్కార్ అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు పవన్‌ (Pawan Kalyan) పేర్కొన్నారు. ‘హరిహర వీరమల్లు’ కోసం కీరవాణి సమకూర్చిన ‘సలసల’ అనే పాట 50 సార్లు విన్నానని.. పౌరుషం తగ్గినప్పుడు ఆ పాట వింటే పౌరుషం వస్తుందని ఆయన తెలిపారు.

‘మీరు అందుకున్న ఆస్కార్ అవార్డు ఎక్కడ ఉంది’ అని పవన్ అడగగా.. కీరవాణి అవార్డు తీసుకొచ్చి పవన్‌కి చూపించారు. అనంతరం పవన్ చేతుల మీదుగా మళ్లీ అవార్డును అందుకున్నారు. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ జూన్ 12వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News