Friday, June 6, 2025

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘ఒజి’ అప్‌డేట్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ రావడం బాగా తగ్గిపోయింది. చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. కానీ, అంతకు ముందే అనౌన్స్ చేసిన భారీ యాక్షన్ చిత్రం  ‘ఒజి’(OG)  నుంచి మాత్రం అప్‌డేట్స్ రావడం బాగా తగ్గిపోయింది. తాజాగా ‘ఒజి’ నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చేసింది.

సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా(OG) షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’’ అనే క్యాప్షన్‌తో త్వరలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు హింట్ ఇచ్చింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌(Pawan Kalyan) సరసన ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఢివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News