హైదరాబాద్: పవర్‌స్టార్, ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ నటించిన పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి నిర్వహిస్తున్నారు. దానికంటే ముందే చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో పవన్‌కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర నిర్మాత ఎఎం రత్నంపై (AM Rathnam) ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎఎం రత్నం ఎంతో చేశారని కొనియాడారు.
రత్నంను (AM Rathnam) ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించాలని సిఎం చంద్రబాబు నాయుడిని కోరుతున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఆయన తన నిర్మాత కాబట్టే కాదని.. ఆ పదవిని రత్నంకు ఇస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే ఆ పదవిని ఆయనకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాను కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగితా భాగం ఎఎం జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.