Thursday, May 8, 2025

సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం:పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దని, ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టవద్దని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కోరారు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దని సూచించారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెహల్గం టూరిస్ట్ లను చంపారు..హిందువు కదా అని అడిగి మరి చంపారు…చనిపోయిన వాళ్ళ లో ఆంధ్ర కు చెందిన వాళ్ళు ఇద్దరు చనిపోయారని, హిందువు కదా అని తెలుసుకోవడానికి ఖల్మ చదవమని చెప్పారన్నారు. సామాన్య జనాలకు ఇబ్బంది కాకుండా తీవ్రవాదులను చంపారని, కాశ్మీర్ అనేది దేశంలో భాగం అన్నారు.

1990 లో కాశ్మీర్ పండిట్ లను చంపారని, అంత్యక్రియలను చేయడానికి వచ్చిన వారిని చంపారని, సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం తీసుకుందన్నారు. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ లాంటి ఘటనలు చూశామని, మిలిటరీ యుద్ధం చేస్తుంటే మనం ఏమి చేయాలో అది తెలియాలని, దాని కోసమే మాక్ డ్రిల్ కార్యక్రమం అన్నారు. దేశ ద్రోహులకు సోషల్ మీడియా లో సరైన సమాధానం చెప్పాలని, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ పై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలు అంత ప్రధాని మోదీకి సపోర్ట్ గా ఉండాలని అన్నారు. తాను అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, కొద్ది మంది కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రోత్సాహకంగా మాట్లాడవద్దని కోరారు.

హిందీలో ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్ : ధైర్యం లేని చోట ధర్మం కోల్పోతారని, స్వార్థం రాజ్యమేలుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత సరిహద్దులో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఆయన స్పందించారు. “దశాబ్దాల సహనం… సహనం. చాలా సేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, ‘ఆపరేషన్ సిందూర్‘ ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం. జై హింద్‌”. అంటూ పవన్ కల్యాణ్ హిందీలో ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News