- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మంచి అంచనాలున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. భీమ్లా నాయక్ సినిమా తర్వాత తన నుంచి మరో పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఇది వరకే కొంతమేర కూడా పూర్తయింది. అయితే ఈ షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది అని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇక తాజాగా స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి మొదలు కాబోతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఉస్తాద్ ఇంకొన్ని రోజుల్లో సెట్స్ లో దిగనున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
- Advertisement -