- Advertisement -
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా.. తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు ఒక్కసారైనా సిఎంను కలిశారా? అని ప్రశ్నించారు. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా కలవడానికి రావద్దని అన్నారు.
గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా అవమానించిందో మరిచిపోయారని.. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని పవన్ అన్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని.. సినీ సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -