Monday, July 21, 2025

సినిమాను అనాథగా వదిలేయలేదు.. అందుకే వచ్చా: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. జూలై 24న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలో మేకర్స్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పవన్ మాట్లాడుతూ.. ఈ సినిమా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని చెప్పారు. పాలిటిక్స్లోకి వెళ్లడం కూడా కొంత అంతరాయం కలిగించిందని.. ఈ సినిమాకు తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చానని తెలిపారు. చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్ చేశానన్నారు. మండుటెండల్లో చాలా రోజులు సినిమా క్లైమాక్స్ చేశామని.. క్లైమాక్స్ పార్ట్ను ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. సినిమా బతకాలని.. ఈ సినిమా కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. “సినిమాను అనాథగా వదిలేయలేదు. అండగా ఉన్నానని చెప్పేందుకు వచ్చాను. కరోనా సహా ఎన్నో ఇబ్బందులు ఈ సినిమా నిర్మాణంలో వచ్చాయి. సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత ఎం ఎం రత్నం. నా చిత్రాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియని నేను కేవలం రత్నం లాంటి నిర్మాతకు అండగా ఉండాలనే ఈ ప్రెస్ మీట్ కు వచ్చా” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News