- Advertisement -
అమరావతి: రుషికొండ ప్యాలెస్ ను టూరిజం ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉండడానికే రుషికొండ ప్యాలెస్ కట్టారని అన్నారు. విశాఖలో రుషికొండ ప్యాలెస్ ను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 7 బ్లాక్ లకు గాను 4 బ్లాక్ లు నిర్మించారని, 4 బ్లాక్ ల నిర్మాణాలకు రూ. 454 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేశారని తెలియజేశారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని మండిపడ్డారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏడాదికి రూ. 7 కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఏటా రూ. 15 లక్షల కరెంట్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ప్యాలెస్ పరిశీలనకు మమ్మల్సి రానివ్వలేదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
Read Also : భారత్ కు జపాన్ కీలక భాగస్వామి
- Advertisement -