Thursday, July 31, 2025

పాయల్ రాజ్ పుత్ తండ్రి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(67) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి క్షణం నాన్నను మిస్ అవుతూనే ఉంటానని పాయల్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. క్యాన్సర్‌ను జయిస్తావని తాను అనుకున్నానని, కానీ మీకు మనోధైర్యం ఇవ్వడానికి తాను చేయాల్సినదంతా చేశానని బాధతో తెలిపారు. నాన్నను కాపాడుకునే పోరాటంలో తాను అపజయం పాలయ్యానని బాధను వ్యక్తం చేశారు. క్షమించండి నాన్న అంటూ భావోద్వేగంతో పోస్టు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విమల్ కుమార్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News