Monday, September 15, 2025

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందచేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో సుమారు 20 వేల ఇళ్ల గోడలు, 8633 ఇళ్ల రూఫ్ పూర్తి అయ్యాయని ఎండి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి, ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ. 146.30 కోట్లను విడుదల చేశామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: రవితేజ వారసుడి నెక్ట్స్‌ మూవీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News