- Advertisement -
హైదరాబాద్: గాంధీభవన్‌లో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తదితరలు పాల్గొన్నారు. పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై పిఎసి సంతాపం తెలిపింది. బిసి కులగణన, ఎస్‌సి వర్గీకరణకు చేపట్టిన చర్యలు, జై బాపు-జై భీమ్-జై సంవిధాన్ కార్యక్రమాలపై నేతలు చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై మంతనాలు జరిపారు.
- Advertisement -