- Advertisement -
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాడికి ప్రతీకరంగా భారత్ (India) ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే అమెరికా కలుగజేసుకొని రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. అయినప్పటికీ పాకిస్థాన్(Pakistan) తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. సరిహద్దుల వెంబడి కాల్పులు ప్రారంభిచది. వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పకొడుతోంది.
అయితే ఈ క్రమంలో కాల్పుల విరమణ, తదనంత పరిస్థతిపై భారత్(India), ఫాకిస్థాన్(Pakistan) మధ్య చర్చలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో ఇరుదేశాల డిజిఎంఒలు మాట్లాడు కోనున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వాటిని తగ్గించేకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఈ కాల్‌లో మాట్లాడుకోనున్నారు.
- Advertisement -