అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రికి వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. 15 నెలల తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా ఆయన తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు. సుప్రీం ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడినా గెలిచినా ప్యాక్షనిజం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తాడిపత్రికి రాకుండా టిడిపి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. హైకోర్డు ఆర్డర్స్ ఉన్నప్పటి తనని తాడిపత్రి రానివ్వడంలేదని కేతిరెడ్డి ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గతంలో తాడిపత్రికి కేతిరెడ్డి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తులు ఆయన ఇంటిని చుట్టుముట్టడానికి ప్రయత్నించారు.
Also Read: పూర్తిగా బీస్ట్ మోడ్లో..