Friday, July 4, 2025

పెద్దవంగరలో కోడలు ఆత్మహత్య… మామ గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామంలో కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో మామ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అవుతాపురం గ్రామంలో వేముల సంతోష్, ఝాన్సీ(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఆమె ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా భర్త ప్రైవేటు కంపెనీలో వర్క్ చేస్తున్నాడు.

ప్రైవేటు పాఠశాలలో సమావేశం జరిగిన అనంతరం యాజమాన్యం ఝాన్సీని మందలించింది. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరులేని ఉరేసుకుంది. గ్రామస్థులు గమనించి ఆమెను తొర్రూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మరణ వార్త వినగానే మృతురాలి మామ వేముల లక్ష్మణ్(60) కుప్పకూలిపోయాడు. వెంటే అతడని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు చెప్పారు. గంట వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అవుతాపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News