Tuesday, July 8, 2025

భారీ పోరాటాల చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఇప్పటికే ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్ర యూనిట్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్స్ ని డిజైన్ చేశారు. ఈ ట్రైన్ స్టంట్ కోసం రూపొందించిన సెట్స్ కన్నులకు పండుగగా ఉండబోతున్నాయి.

ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ గురువారం వరకు కొనసాగనుంది. పుష్ప 2 వంటి చిత్రాల్లో తన వర్కింగ్ స్టయిల్‌తో ఆకట్టుకున్న నబాకాంత్ మాస్టర్ ఈ యాక్ష న్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు. పెద్ది ఐకానిక్ క్రికెట్ షాట్ కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పలు హై-ప్రొఫైల్ (High-profile) ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ఈ చిత్రంలోనే అత్యంత భారీగా రూపుదిద్దుకున్న యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా వుండబోతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News