- Advertisement -
మన తెలంగాణ/బోడుప్పల్ : కులవృత్తిని నమ్ముకుని ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుద్ధ నగర్ కి చెందిన రాజు చారి(36)కులవృత్తి నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా బంగారం పని చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నాడు.మూడు సంవత్సరాలుగా పనులు లేకపోవడంతో సంపాదనలేక ఆర్థిక ఇబ్బందులతో, గల్లీ గల్లీకి మార్వాడి దుకాణాలు ఏర్పడడంతో పనులు లేక కులవృత్తిని నమ్ముకొని ఉన్న ఇతను వేరే వ్యాపారం చేయడానికి ఆర్థిక, ఆరోగ్య సమస్యతో మనోవేదన గురై మృతి చెందాడని, ఈ మార్వాడి వ్యాపారస్తులను తరిమికొట్టాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -