Monday, August 25, 2025

ఎపికి మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తాం: మంత్రి నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: మున్సిపాలిటీల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని ఎపి మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని అన్నారు. పెండింగ్ పనులపై తుడా, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులతో నారాయణ సమీక్షించారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని, ఆరు కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల చెత్త శుభ్రం చేస్తామని, పెండింగ్ లోని టిడిఆర్ బాండ్ల (TDR Bonds) సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం రూ. 50 కోట్ల విలువైన బాండ్లను.. రూ.750 కోట్లకే జారీ చేశారని, తిరుపతిని మెగాసిటీగా మార్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. వచ్చే జూన్ నాటికి తుడా టవర్స్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, శెట్టిపల్లి ప్రజల భూసమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News