Friday, May 2, 2025

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌తో పాటు తెలంగాణను కూడా గెలుద్దాం
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకు కొడంగల్‌తో పాటు తెలంగాణను కూడా గెలుద్దాం అంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ గెలుపు ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన టిపిసిసి చీఫ్ కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News