Friday, July 11, 2025

రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్‌కు బెయిల్ ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన ఎ.జి. పెరారివాలన్‌కు అతడి ప్రవర్తన దృష్టా బెయిల్‌పై విడుదలచేయొచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. అతడి ఆరోగ్య పరిస్థితి, విద్యార్హతలు దృష్టా బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం పెరారివాలన్ పేరోల్‌పై ఉన్నారు. కానీ అతడిని ఇంటి నుంచి బయటకు రావడానికి, అలాగే ఎవరినీ కలవడానికి అనుమతించడంలేదు అని కూడా తెలిపారు. న్యాయమూర్తులు ఎల్. నాగేశ్వర రావు, బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం సంబంధిత విచారణ కోర్టు షరతులకు సంతృప్తికరంగా ఉంటే పెరారివాలన్‌ను విడుదలచేయొచ్చని, అతడు స్థానిక పోలీస్ స్టేషేన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపింది. పెరారివాలన్ ఇప్పటికే 32 ఏళ్ల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News