దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు: (Hari Hara Veeramallu) పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు.
బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇక జూలై 20వ తేదీన వైజాగ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను (Pre release ceremony) నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.