దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ’కాంత’ (Kantha) టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ, -తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంత ఫస్ట్ సింగిల్ హే పసి మనసేను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని అద్భుతంగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఝాను చంతర్. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ ప్రేమలోని ప్రయాణాన్ని (journey love) అందంగా చూపిస్తే, ప్రదీప్ కుమార్, – ప్రియాంకా ఎన్‌కే గాత్రాలు మనసుని హత్తుకున్నాయి. దుల్కర్ సల్మాన్, – భాగ్యశ్రీ బోర్స్ కెమిస్ట్రీ ఈ ప్రేమకథకి రియల్ ఫీల్‌ని తీసుకొచ్చింది. ‘కాంత’ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
హే పసి మనసే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -