- Advertisement -
తెలంగాణ విద్యుత్ శాఖ నార్త్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (టీజీ ఎన్పీడీసీఎల్ ) పరిధిలో 339 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంధన శాఖలో 217 మంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మరో 216 ఇతర కేటగిరి పోస్టులు ఉండేవని తెలిపారు. గ్రేడ్- 1 డీఎం పోస్టు నుంచి మొదలుకుని స్టోర్ కీపర్ ఉద్యోగి వరకు ఉన్న పోస్టులను క్రోడీకరించి అవసరమైన వాటిని ఉంచుకుని మిగతా వాటిని తొలగించామని, వీటికి మరి కొన్ని పోస్టులు కూడా చేర్చడం ద్వారా ఈ సంఖ్య 339కి చేరిందని సందీప్ కుమార్ సుల్తానియా ఆ ప్రకటనలో తెలిపారు. కాగా ట్రాన్స్‌కో సంస్థ 2022 సంవత్సరం పే స్కేల్స్‌ను రివైజ్ చేస్తున్న క్రమంలో ఆర్థిక శాఖ ఈ 339 పోస్టులను అనుమతించడం గమనార్హం.
- Advertisement -