- Advertisement -
మనతెలంగాణ/జ్యోతినగర్: ఈ నెల 27 నుండి జరిగే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. అత్యంత వైభవంగా జరుపుకునే నవరాత్రి ఉత్సవాల ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆయా కాలనీల వద్ద ఏర్పాటు చేసే వినాయక మండపాల ఎత్తు, వినాయక విగ్రహాల ఎత్తు తప్పనిసరిగా తెలపాలని అన్నారు. అదేవిధంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్ల పేర్లు ఫోన్ నెంబర్లు తెలపాలని, వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అత్యవసరం ఉంటే పోలీస్ 100కు డయల్ చేయాలని తెలిపారు.
- Advertisement -