అమరావతి: టిడిపి ఉప్పాల హారికపై దాడి చేసి రివర్స్ కేసు పెట్టడం దారుణం అని మాజీ మంత్రి పేర్నినాని (perni nani) తెలిపారు. ఎపి మంత్రి నారా లోకేష్ డైరెక్షన్ లోనే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేయించారని, ఫ్లెక్సీని చించి గాయపడితే కారుతో ఢీకొట్టారని ఫిర్యాదు చేశారని విమర్శించారు. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు డబ్బులున్న ప్రశాంతి రెడ్డి మహాతల్లి అయ్యిందని, మహాతల్లి నుంచి కొల్లు రవీంద్రకు ముడుపులు వస్తున్నాయని తెలియజేశారు. మూటలు వస్తున్నాయనే ప్రశాంతి రెడ్డిని మహాతల్లి అంటున్నారని చెప్పారు. గుడివాడలో అల్లర్లు సృషించాలని (create riot) ప్రయత్నించింది టిడిపి కాదా? అని ప్రశ్నించారు. 13 నెలలుగా తప్పుడు కేసులే పనిగా పెట్టుకున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు.
ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు: పేర్నినాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -