Saturday, July 12, 2025

మనం రోజూ రప్పా.. రప్పా అంటే జనంలో చులకనే : పేర్నినాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: చీకట్లో కన్ను కొడితే పని అయిపోదు అది తెలుసుకోండి అని కార్యకర్తలతో  వైసిపి మాజీ మంత్రి పేర్నినాని (perni nani) తెలిపారు. చెప్పికాదు.. చెప్పకుండా నరికేయాలని అన్నారు. పామర్రులో శుక్రవారం వైసిపి కార్యకర్తల భేటీలో పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. నిజాలు చెప్పే మీడియాపైనా అక్కసు వెళ్లగక్కారు. అంతా అయిపోయాక ఉదయం మనం కూడా పరామర్శలకు వెళ్లాలని, ఇప్పుడు అరవడం కాదని, తప్పు చేసినవాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండని చెప్పారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి సరదాగా రప్పా.. రప్పా అన్నారని, తమరు దాన్ని పట్టుకుని రోజూ ఎందుకు మాట్లాడుతున్నారు? అని  ప్రశ్నించారు.

మనం రోజూ రప్పా రప్పా అంటే జనంలో చులకన అయిపోతామని, మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అని తెలుసుకోండి అని అన్నారు. మంత్రి నారా లోకేష్ చెప్పే రెడ్ బుక్..(Lokesh Red Book) రేపు వారికే ఉరితాడు అవుతుందని, ఎబిఎన్, ఆంధ్రజ్యోతి సహా పలు ఛానళ్లు, పేపర్లు..జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఛానల్, పేపర్లను ముక్కముక్కలుగా చేసేది తమలాంటి కార్యకర్తలేనని, ఆ బాధ్యత తమరు తీసుకోండంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా పేర్ని నాని మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News