- Advertisement -
అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పర్‌ఫ్లెక్సిటీ ఆసక్తి చూపుతోంది. గూగుల్‌కు 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. పర్‌ఫ్లెక్సిటీ ప్రస్తుతం అరవింద్ శ్రీనివాసన్ నేతృత్వంలో నడుస్తోంది. అయితే గూగుల్‌కు ఆఫర్ చేసిన మొత్తం పర్‌ఫ్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువకన్నా అధిక కావడం విశేషం. ఈ డీల్‌ను ముగించేందుకు పర్‌ఫ్లెక్సిటీ ఇతర పెట్టుబడిదారుల సాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. బహుళ రకాల పెట్టుబడిదారులు కూడా ఇందుకు ముందుకు వచ్చినట్లు పర్‌ఫ్లెక్సిటీ తెలిపిందని ఆ కథనం సారాంశం.
- Advertisement -