పేరుపల్లి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగు
డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు చేరిన నీరు
రాకపోకలకు అంతరాయం
వాగును పరిశీలించిన డిపిఓ డిఎల్పిఓ
మన తెలంగాణ/కారేపల్లిః కారేపల్లి, మాదారం రహదారి మార్గంలో పేరుపల్లి బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో డిపిఓ ఆశాలత, డిఎల్పిఓ రాంబాబు, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ శనివారం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి రాత్రి సమయంలో వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ట్రాక్టర్ ద్వారా డబుల్ బెడ్రూంలో నివసిస్తున్న 15 కుటుంబాలను పేరుపల్లి హై స్కూల్ కు తరలించి, పునరావాసం కల్పించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ వాగుల ఉదృ్ధతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి సంబంధిత బాధితులు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు.
గత వారం రోజులుగాఉధృతంగా కురిసిన వర్షాలకు మండల వ్యాప్తంగా చెరువులు, కుండలు నిండిపోయాయి. వర్షాల ప్రభావంతో మండలంలో అనేక ప్రాంతాల్లో రైతులు సాగు, మెట్ట పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని పేరుపల్లి వద్ద బుగ్గ వాగు శనివారం ఉదృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. పేరుపల్లి – మాదారం ప్రధాన రహదారిపై బుగ్గ వాగు రోడ్డుపైన సుమారు ఐదు అడుగుల మేర ఉదృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా గాంధీపురం వద్ద భూపతి రాయుని చెరువు, తోడితలగూడెం, మాణిక్యరాం నుండి చీమలపాడు వెళ్లే దారి లోతట్టు ప్రాంతంలో అలుగులు పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.