Monday, July 28, 2025

బహుభాషా కోవిదుడు పీటర్ కాన్ట్స్ంటైన్

- Advertisement -
- Advertisement -

జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, ఆధునిక గ్రీకు, ప్రాచీన గ్రీకు, ఇటాలియన్, అల్బేనియన్, డచ్, స్లోవేన్ నుండి సాహిత్యానువాదం చేసే పీటర్ కాన్ట్‌ంటైన్ లండన్‌లో జన్మించారు. తండ్రి టర్కిష్, గ్రీక్ సంతతికి చెందిన వారైతే ఆయన తల్లి ఆస్ట్రియాకు చెందిన వారు. లండన్‌లో గ్రీస్‌లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. గ్రీస్‌లో ఉన్నప్పుడు సంస్కృతం, ర ష్యన్, గ్రీక్, జిప్సీలు మాట్లాడే రొ మాని, ఇంకా స్లావిక్ భాషలతో కూడా ఆయనకీపరిచయం అయ్యింది. విభిన్న సంస్కృతులు, భాషల మధ్య పెరగడమే తనను అనువాదకుడిగా మార్చిందంటారు పీటర్. భారత దేశంలో కూడా అధిక శాతం చిన్నప్పటినించి మూడు భాషలు మాట్లాడ్డం చదవడం చేస్తారని, అది అనువాదకులుగా ఎదగడానికి చాలా అనువైన వాతావరణం అని ఆయన అభిప్రాయం.

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్లో అనువాద అధ్యయనాల విభాగంలో ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సోలిత్సిన్, మాకియవెల్లి, దోస్తోవెస్కీ, గొగోల్, తోల్స్తాయ్ సాహిత్యాన్ని అనువదించారు పీటర్. థామస్ మాన్ రాసిన ‘సిక్స్ ఎర్లీ స్టోరీస్’ అనువాదానికి పెన్ ట్రాన్స్లేషన్ ప్రైజ్ వచ్చింది. ‘అన్ డిస్కవర్డ్ చెఖోవ్’ అంటూ ఇంత కు ముందెన్నడూ అనువాదానికి నోచుకోని రెండు వందల చెఖోవ్ కథలను అందించిన పుస్తకానికిగాను ‘నేషనల్ ట్రాన్స్లేషన్ అవార్డు’ పీటర్ గెలుచుకున్న బహుమతుల్లో కొన్ని. ఇదికాక ‘వరల్ పోయెట్రీ బుక్స్’ అనే పత్రికను పీటర్ ప్రచురిస్తున్నారు. ఆయన ప్రారంభ అనువాదాల్లో ‘జపనీస్ వీధి భాష’పై పరిశోధించి, అనువాదం చేసి అం దించిన పుస్తకం అనేక విమర్శకుల ప్రశంసలు పొందింది.

1980లలో జపనీస్ భాష ప్రపంచవ్యాప్తం గా ప్రాముఖ్యత పొందుతున్న సమయంలో ప్రచురించబడిన ఈ పుస్తకం, సాధారణ వ్యాకరణ పుస్తకాలలో నిఘంటువులలో కనిపించని అనధికారిక, రోజువారీ జపనీస్ భాషను ఇంగ్లీష్ అనువాదంలో పాఠకులకు పరిచయం చేసింది. చాలా యూనివర్సిటీల్లో భాషాశాస్త్ర కోర్సులలో ఈ పుస్తకాన్ని పాఠ్య పుస్తకంగా చేర్చారు. అనువదించేటప్పుడు ఏ రచయితను అనువదిస్తే బావుంటుంది అనే ఎంపిక అనువాద నాణ్యతకు చాలా ముఖ్యం అంటారు పీటర్. ఉదాహరణకు చెఖోవ్ రచనా శైలి, హాస్యం అనువదించడానికి తనకు సౌలభ్యం గా, ఇష్టంగా ఉంటుందనీ కాఫ్కా రచనల్లా సంక్లిష్టంగా, అంతర్లీనంగా సందేశం ఉండే రచనలు తన అనువాద శైలికి సరిపడవని పీటర్ చెప్తారు.

వీటితో పాటు పీటర్ ‘Purchased Bride’ అనే ఇంగ్లీషు నవలను రచించారు. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఛాయా బుక్స్ ఈ పుస్తకాన్ని త్వరలో తెలుగు పాఠకులకు అందిస్తోంది. తమ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తావించడానికి ఇష్టపడని పీటర్ నానమ్మ జీవిత చరిత్రే ఈ నవల. పీటర్ నాన్న గారి నాన్న గారు పంతొమ్మిదో శతాబ్దంలో టర్కీలో ఒట్టోమాన్ సామ్రాజ్యంలో జమీందారు. ఆ కాలం లో జమీందార్లకు అనేక మంది భార్యలుండడం పరిపాటి. భార్యలను డబ్బులిచ్చి కొనుక్కునేవారు. గ్రీకు దేశంలో పరిస్థితులు విషమించడం వల్ల బీదరి కం అరాచకం పెరిగిపోయి ఎంతో మంది ఆడ పిల్లలు ఆ దుర్భర పరిస్థితు లు తప్పించుకోవడానికి పక్క దేశాలకు వలస వెళ్ళే వాళ్ళు. అలా తప్పించుకుని వచ్చిన ఒక పదిహేనేళ్ళ ఆడ పిల్లను పీటర్ తాత గారు పెళ్ళి చేసుకోవడం కథాంశం.

కొనుక్కునే ముందర, వరసలో ఆడ పిల్లలను పీటర్ తాతగారి మొదటి భార్య నిలబెట్టి, పరీక్షిం చి ఎంపిక చేసే సంఘటనతో మొదలౌతుంది ఈ నవల. ఆ యువతి తన దేశంలో కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎలా తప్పించుకుని టర్కీ దాకా ప్రయాణిస్తుంది? ఈ వివరాలన్నీ నవలలో విస్తారంగా రాశారు. వందేళ్ళ క్రింతం జరిగిన సంఘటనను గురించిన వివరాలను తమ కుటుంబ సభ్యులనుంచి సేకరించడానికి చాలా శ్రమ పడ్డానని చెప్తారు పీటర్. ఇవి కాక అప్పటి సామాజిక పరిస్థితుల మీద కూడా ఆయన చాలా సమాచారం.

సేకరించాల్సివచ్చింది. అంతేకాక శరణార్ధుల శిబిరాల్లోని జీవితాలను గురించి కూడా వివరాలు తీసుకుని నవలలో కొన్ని పాత్రలను కల్పించడం జరిగింది. పితృస్వామ్యంలో జరిగే అరాచకాలు, ఆడవాళ్ళ అవస్థలను ప్రతిబింబిస్తుంది ఈ నవల. 2023లో డీప్ వెల్లమ్ పబ్లిషర్స్ అమెరికా లో విడుదలైన ఈ నవల పాఠకుల విశేషదారణకు నోచుకుంది. పీటర్ ఈ నెల నాలుగో వారంలో సాల్ట్ సంస్థ (South Asian Literarature in Translation) గ్రాంటు సహాయంతో భారత దేశంలో పర్యటించనున్నారు.

హర్షణీయం బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News