Thursday, May 1, 2025

ఎమ్మెల్యే దానంపై హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టులో పిటషన్ దాఖలు అయ్యింది. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్దమని పిటిషనర్ తెలిపారు.

కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇటీవల అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరారు. దీంతో బిఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News