Thursday, August 14, 2025

నా ప్రాణాలకు ముప్పు ఉంది

- Advertisement -
- Advertisement -

వినాయక్ దామోదర్ సావర్కర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ఫిర్యాదీ దారు నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు పుణే కోర్టుకు తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్షనేత కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఈ మధ్య తాను లేవనెత్తి న రాజకీయ సమస్యలు, సావర్కర్ పై గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా తన భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదీదారు మహాత్మాగాంధీ హత్య కేసులో శిక్షపడిన నాథూరామ్ గాడ్సే బుంధువు అని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదీదారుకు గతంలో హింస, రాజ్యాంగ వ్యతిరేక ధోరణితో కూడిన చరిత్ర ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ భద్రతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు, భయాలను గుర్తించాలని కోరుతూ రాహుల్ గాంధీ తరుపు న్యాయవాది కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.

ఇది కేవలం ఫార్మాలిటీ కోసం చేస్తున్నది కాదని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంటుకుని , రాహుల్ గాంధీకి పారదర్శకతతో కూడిన రక్షణ, దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తరుపు న్యాయవాది మిలింద్ పవా ర్ పేర్కొన్నారు. ఫిర్యాది దారు సత్యకి సావర్కర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులనుంచి ప్రయోజనం పొందేందుకు తన తాతగారి అనుచరులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కోర్టును ప్రభావితం చేసేందుకు లేదా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని దరఖాస్తులో ఆరోపించారు. 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ర్యాలీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ పరువునష్టం కేసు దాఖలైంది. వినాయక్ సావర్కర్ వలస ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందిన బ్రిటీష్ సేవకుడు అని రాహుల్ గాంధీ అభివర్ణించినట్లు ఆరోపించారు.

రాహుల్ గాంధీ ర్యాలీ సందర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఫిర్యాదు దారుడు సత్యకి సావర్కర్ ఈ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ సమయంలో సావర్కర్ ఒక సీడీ, రాహుల్ ప్రసంగానికి సంబంధించిన ట్రాన్స్కిప్ట్ ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేఫథ్యంలో రాహుల్ గాంధీకి ప్రాణహాని, ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని, దరఖాస్తులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News