Wednesday, August 20, 2025

‘ఫౌజీ’ సెట్స్‌లో ఫోటో లీక్.. తీవ్రంగా హెచ్చరించిన నిర్మాణ సంస్థ

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న సినిమా ఒకటి. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. కానీ, ‘ఫౌజీ’ (Fauji) అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ అయింది. ఈ స్టిల్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంకేముంది.. అభిమానులు ఈ స్టిల్‌ని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సినిమా గోప్యత దెబ్బతినే అవకాశం ఉందని భావించిన నిర్మాణ సంస్థ.. ఈ విషయంపై తీవ్రంగా హెచ్చరించింది.

‘‘ఈ సినిమా (Fauji) కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. చిత్రీకరణ సమయంలో సెట్స్‌ నుంచి ఓ ఫోటో లీక్ అయినట్లు మాకు తెలిసింది. మీకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. ఇలాంటి లీక్‌లు మా టీమ్ నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైన ఈ ఫోటోలను షేర్ చేస్తే.. వారి ఖాతాలను తొలగించడమే కాక.. దాన్ని సైబర్ నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటాం’’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 1940 దశకంలో జరిగే కథ ఇది అని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మాతృభూమి కోసం ఓ యోధుడుగా ఈ కథ ఉండనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్రభాస సరసన సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News