Wednesday, September 17, 2025

చంద్రబాబుతో పికె భేటీ

- Advertisement -
- Advertisement -

ఎపి వ్యూహరచనపై చర్చలు

గత ఎన్నికల్లో జగన్ వ్యూహకర్తగా వ్యవహరించిన పికె

మన తెలంగాణ / హైదరాబాద్ : మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాట్లతో పాటు అధికార పార్టీని ఓడించడానికి వ్యూహరచనలను ముమ్మరం చేశారు. ఇందు లో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం చంద్రబాబుతో సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మా రింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్వయాన ప్రశాంత్ కిషోర్‌ను తన వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు.

ప్రశాంత్ కిషోర్ గత ఏపీ అసెం బ్లీ ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయానికి వ్యూహ రచన చేసి గెలిపించారు. ఆనాటి ఎన్నికల్లో వైసిపి 151 స్థానాల్లో విజయసాధించగా టిడిపి 23 సీట్లకే పరిమితం అయ్యింది.జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్ర మే దక్కింది. జాతీయ పార్టీలైన కాం గ్రెస్, బిజెపి ఒక్క సీటు కూడా గెలవలేక పో యాయి. అనంతరం జగన్, కిషోర్ మధ్య దూ రం పెరగడంతో ఎపి రాజకీయాల వైపు పికె దృష్టిని సారించలేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగేందుకు అవకాశముండడంతో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News