Friday, August 1, 2025

ప్లాస్టిక్ ముప్పు తప్పేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తుదముట్టించడానికి ఐక్యరాజ్యసమితి ఒప్పందం పై అంతర్జాతీయ స్థాయిలో జెనీవాలో వచ్చే ఆగస్టులో చర్చలు జరగనున్నాయి. అయితే ఈప్రతిపాదిత ఒప్పందంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించడానికి కావలసిన చట్టం పొందుపర్చలేదని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్స్‌తో ముడిపడి ఉన్న ప్రమాదకరమైన రసాయనాలను, ప్లాస్టిక్‌ఉత్పతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యసమస్యను ఈ ఒప్పందం ఏ విధంగానూ పరిష్కరించలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణనుంచి ప్రమాదకరమైన వస్తువుగా ప్లాస్టిక్‌ను పరిగణించేలా ఒప్పందంలో మార్పులు రావలసి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు శాస్త్రీయ ఆధారాలను పెంచడంలో వారి విజ్ఞప్తి ఆవశ్యకత ఆధారపడి ఉంటుంది.

నూతన క్రమబద్ధమైన సమీక్ష అధిక నిశ్చయ సాక్షాన్ని కనుగొంది. మానవుల పునరుత్పత్తి, జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థలపై మైక్రోప్లాస్టిక్స్ విపరీత ప్రభావాన్ని(Microplastics huge impact) చూపిస్తాయని కనుగొనగలిగారు. ఈ సమీక్షలోని 31 అధ్యయనాల్లో కేవలం మూడు అధ్యయనాల్లోనే మానవ ప్రాతినిధ్యం, 28 జంతు అధ్యయనాల డేటా చేర్చినప్పటికీ, ప్రమాదకరమైన జీవప్రభావాలని ఎత్తిచూపాయి. మైక్రోప్లాస్టిక్ ప్రభావంతో సంతాన సామర్థం తగ్గిపోతుందని, పేగుల వాపు వస్తుందని, శ్వాసకోశ వ్యవస్థకు ప్రమాదం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. భారీ ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేయడం వల్ల మైక్రోప్లాస్టిక్స్, ప్లాస్టిక్ రేణువులు వెలువడతాయి.వీటిని ఉద్దేశపూర్వకంగా వినియోగంలోకి తీసుకుంటే మానవుల ఊపిరితిత్తుల్లో, రక్తం, మూత్రపిండాలు, ప్లాసెంటా, చివరికి మెదడు కండరాల్లో కూడా కనిపిస్తుంటాయి.

ఇవి విషపూరితమైన రసాయనాలు వ్యాప్తి చేస్తాయి. వీటిలో కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్లు అంటే ఎండోక్రైన్ వ్యవస్థను ఆటంకపరిచే రసాయనాలు. ఇవి హార్మోన్, రోగనిరోధక వ్యవస్థల్లో జోక్యం చేసుకుని తీవ్రప్రభావం చూపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటా యి. ప్లాస్టిక్ పదార్ధాలు 16,000 రసాయనాలతో నిర్మాణమవుతుంటాయి. వీటిలో 4200 రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇందులో ధాలెట్లు, బిస్‌ఫినాల్, పర్‌పాలీఫ్లోరో ఆల్కైల్ పదార్థాలు క్యాన్సర్, సంతానలేమి, నరాల వ్యవస్థ ప్రమాదకారకాలుగా ఉంటాయి. అయితే అత్యధిక సంఖ్యలో ప్లాస్టిక్‌లో ఉపయోగించే ఈ రసాయనాల డేటా అందుబాటులో ఉండడం లేదు. ఇది ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ విధమైన సాక్షాలు పెరుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి ప్లాస్టిక్ ఒప్పందం నమూనాలో ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి వీటిని పొందుపర్చకపోవడం గమనార్హం.

‘ఈ ఒప్పందం ప్లాస్టిక్ కేవలం వ్యర్థపదార్ధంగా కాకుండా ఒక విషపూరిత పదార్ధంగా దృష్టిని కేంద్రీకరించవలసి ఉంది. లేకపోతే మనం వ్యాధిని విస్మరిస్తూ లక్షణాలను మాత్రమే నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో నాలుగింటిలో ఒకటి పర్యావరణ సమస్యల వల్లనే అని తెలుస్తోంది. ఇందులో కాలుష్యం, విషపూరిత రసాయనాలు ప్రభావం కూడా ఉంది. ఈ సమస్య స్వల్ప, మధ్యాదాయ దేశాలపై విచక్షణా రహితంగా భారంగా తయారవుతోంది. శిలాజ ఇంధనాలతో ఎక్కువగా తయారయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇలాగే కొనసాగితే 2060 నాటికి మూడింతలు పెరిగి సమస్య మరింత తీవ్రం అవుతుంది.ప్లాస్టిక్ తయారీలో ప్రతిదశలోనూ విడుదలయ్యే హానికరమైన ఉద్గారాలు, కాలుష్య కారకాలు వెలువడి వాతావరణాన్ని అత్యంత కాలుష్యమయం చేస్తాయి.

ప్లాస్టిక్, శిలాజ ఇంధనాల పరిశ్రమలు ఏ విధంగా బడుగువర్గాల సమాజాలను ప్రమాదాన్ని కలిగిస్తున్నాయో లాస్‌ఏంజెలెస్ లోని పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గ్యాసులీన్ డిమాండ్ తగ్గిపోతుండడంతో చమురు సంస్థలు ప్లాస్టిక్ తయారీపై దృష్టి మళ్లిస్తున్నాయి. ఇది కాలుష్యాన్ని, వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది. సుదీర్ఘకాలంలో భూగోళానికి, ప్రజలకు, రోగులకు క్షేమం కలగాలంటే ప్లాస్టిక్ తయారీని వీలైనంతవరకు నిరోధించే ప్రయత్నం చేయడం మంచిదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, తిరిగి రీసైక్లింగ్ చేసి వినియోగించడం వంటి ప్రక్రియలు కన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించేలా ఐక్యరాజ్య సమితి ఒప్పందం సూచనలు అందించాలని వీరు ఆకాంక్షిస్తున్నారు.

  • కె. యాదగిరి రెడ్డి
    98667 89511
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News