Tuesday, September 9, 2025

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు.. ప్రధాని ఇంటిపై దాడి

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు: నేపాల్‌లో ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతోపాటు పలు పట్టణాల్లో వందల సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో నేపాల్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి స్వస్థలమైన డమాక్‌లోని ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించడం, కర్ఫ్యూ అమలు చేయడం, కనిపించగానే కాల్పులు జరపడం వంటి ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చింది.

ఇక, నిరసనకారులు కూడా పోలీసులు, సైనికులపై రాళ్ల దాడికి దిగారు. వారిని అడ్డుకునేందుకు సైనికులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 19 మంది ఆందోళనకారులు మరణించినట్లు సమాచారం. అలాగే, వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, నేపాల్‌లో పరిస్థితి మరింత దిగజారడంతో, ఆ దేశ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో హింసాకాండాకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి ఆయన ముందుకొచ్చారు.

కాగా, ఫేస్‌బుక్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసనకారులు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రంపై దాడి అని పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నియంత్రణలో ఉండాలని చెబుతూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించింది.

Also Read: భారత్‌లో అతిపెద్ద రైలు సొరంగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News