ఇది టెర్రరిస్టులను వారి ఇళ్లలోనే మట్టుబెట్టే నయా భారత్
అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
ఆపరేషన్ సిందూర్‌తో కలిగిన నష్టాన్ని అంగీకరించిన జైషే ఉగ్రవాద సంస్థ
ఇప్పటికైన వాస్తవం వెల్లడైంది
ఇది ఆపరేషన్ సిందూర్‌కు అద్దంపడుతున్నది
మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని
75వ వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : అణు బెదిరింపులకు భారతదేశం భయపడబోదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్ లో జరిగిన భారీర్యాలీలో ప్రసంగించిన ప్రధాని భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో జే ష్ -ఏ- మొహమ్మద్ చావు దెబ్బతిన్న విషయాన్ని మొదటి సారి అంగీకరించినట్లు ఇండియా టుడే బహిరంగంగా ప్రకటించి న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా, జేషే అగ్ర కమాండర్ వాస్తవాన్ని అంగీకరించిన విషయం వెల్లడికావడంతో, భా రతదేశం టెర్రరిజం పట్ల తీవ్రంగా స్పందించడమే కాక, అణు బెదిరింపులకు ఏమాత్రం భయపడదని రుజువు చేసిందని మో దీ అన్నారు. పాక్ టెర్రరిస్ట్ లు మన సోదరీమణుల నుదుటి సింధూరాన్ని తుడిచివే స్తే, ఆపరేషన్ సిందూర్ నిర్వహించి, టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశామని ప్రధాని గుర్తు చేశా రు. భారత సాయుధ దళాలు ప్రతిభాపాటవాలతో రెప్పపాటు వ్యవధిలో పాకిస్తాన్ ను మోకరిల్లేటట్లు చేశాయన్నారు. నిన్న నే ప్రపంచం మరో పాకిస్తానీ టెర్రరిస్ట్ తమ కష్టాలను కన్నీటి తో వివరించడాన్ని చూసింది. అణు బెదిరింపులకు భారతదే శం వణికిపోదు.
ఇది టెర్రరిస్ట్ లను వారి ఇళ్లలోనే మట్టు పెట్టే నవ భారతం అని ప్రధాని మోదీ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.మే7న బహవల్పూర్లోని జేషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో జేషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరణించారని జేషే అగ్ర కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారని ఇండియా టుడే కథనం ప్రచురించిన తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ టెర్రరిస్ట్ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ను భారతదేశం ప్రారంభించింది. ఎంతో సాహసంతో సాగిన వైమానిక దాడిలో పాకిస్తాన్ లోని బహవల్పూర్ తో పాటు మరో ఎనిమిది టెర్రరిస్ట్ స్థావరాలు నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే ఇలియాస్ కశ్మీరీ భహవల్పూర్ దాడిలో అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని అంగీకరించాడు. అలాగే ఢిల్లీ, ముంబైలో టెర్రరిస్ట్ దాడులలో మసూద్ అజర్ పాత్రను, మసూద్ కుట్రలు, కార్యకలాపాలకు పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రధాన స్థావరంగా పనిచేస్తోందని కూడా కశ్మీరీ వెల్లడించాడు.
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణాలు: మోడీ
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. “ ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచనదినం నిర్వహిస్తున్నాం ” అని మోడీ అన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని కొనియాడారు.
Also Read: చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీలు: అమిత్‌షా