Monday, July 21, 2025

22 నిమిషాల్లోనే పాక్ ఉగ్రస్థావరాలను భూ స్థాపితం చేశాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని మాట్లాడారు. తొలిసారి ఆపరేషన్ సిందూర్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా.. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను మన ఆర్మీ భూ స్థాపితం చేసిందని చెప్పారు. మేడిన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని.. ఆ ఆయుధాలు వాటి సత్తా నిరూపించుకున్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని.. భారత సైనిక బలాన్ని ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూసాయని తెలిపారు.

మావోయిస్టు ముక్త్ భారత్లో ముందడుగు వేశామని, దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందని ప్రదాని చెప్పారు. అనేక ప్రాంతాలను మావోయిస్టుల నీడ నుంచి బయటకు తీసుకొచ్చామని.. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లుగా మారిపోయాయని ఆయన తెలిపారు. రెడ్ కారిడార్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయని.. వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని మోడీ అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానన్నారు. ఇక, యాక్సియం-4 మిషన్పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర సృష్టించిందని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News