- Advertisement -
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పవికి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశాక.. ఆ పదవిలో ఎవరు భర్తీ చేస్తారన విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఎన్డిఎ.. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న సిపి రాధాకృష్ణన్‌ను తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రధాని మోదీ (PM Modi) రాధాకృష్ణను ఉప రాష్ట్రపతిగా చేసేందుకు ప్రతిపక్షాలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఎన్నిక లేకుండా ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు అన్ని ప్రతిపక్షపార్టీలు సహకరించాలని మోదీ కోరికనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డిఎ ఎంపిల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను మోదీ ఎంపిలకు పరిచయం చేశారు. ఆనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రలు సన్మానించారు.
- Advertisement -